గోపాల్ రెడ్డి గెలుపు ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచుతుంది ప్రొఫెసర్ కోదండరాం

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 25 (ప్రజాబలం) తెలంగాణ జన సమితి తరపున వ్యక్తిగతంగా కూడా వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గము నుంచి పన్నాల గోపాల్ రెడ్డి కి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను గోపాల్ రెడ్డి గత నాలుగు దశాబ్దాలుగా టీచర్స్ ఉద్యమo లో క్రియాశీలకంగా పని చేస్తున్నాడు అనేక టీచర్ల సమస్యలను చాలా బలంగా లేవనెత్తి ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చాడు అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచి రాగలిగితే ఉపాధ్యాయ వర్గానికి ప్రజలకు న్యాయం చేకూర్చగలడు ఈ గెలుపు ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచుతుంది ఉపాధ్యాయులకు చెప్పవలసిన మరొక విషయం ఏందంటే వారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమoలో తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక సామాజిక సమస్యల మీద గట్టిగా నిలబడి ప్రజల తరఫున గొంతు వినిపించారు ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకొనుటకు విద్యా పరిరక్షణ యాత్ర టీజేఎస్ పార్టీతో కలిసి కృష్ణా జలాల, గోదావరి జలాల పరిరక్షణ యాత్ర చేపట్టినారు. ఉద్యమ స్ఫూర్తి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి కౌన్సిల్లో ఉంటే మన ఉపాధ్యాయులకు న్యాయం చేకూర్చ గలడు ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడ గలడు సామాన్య రైతు కూలీ కుటుంబం నుండి వచ్చిన వాడు ఆయన వద్ద పైసలు లేవు కావచ్చు కానీ పైసలతో గెలిచిన వాళ్లు అందరూ కూడా మన కోసం నిజాయితీగా నిలబెడ తారని గ్యారెంటీ ఏమీ లేదు గత అనుభవం మన ముందు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకోసం గట్టిగా నిలబడి పనిచేసే ఉపాధ్యాయ నాయకు న్ని ఎన్నుకుందాం అటు వంటి అభ్యర్థిని మన ప్రతినిధిగా ఇవాళ కౌన్సిల్కు పంపడానికి కూడా గోపాల్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించ వలసినదిగా వరంగల్ ఖమ్మం నల్గొండ నియోజకవర్గ ఆచార్య అధ్యాపక ఉపాధ్యాయులను కోరుతున్నాను ఎమ్మెల్సీఅభ్యర్థి పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా దావతులు, మందు, మార్బలం ఓట్లు అమ్మడం కొనడం లాంటి విధానాలకు వ్యతిరేకంగా ,జాతి నిర్మాతలైన ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచడం మధ్య జరుగుతున్న ఎన్నికల పోటీ లొ నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వారిని ఎన్నుకోవాలని కోరుతున్నాo అందుకు నేను సరి అయిన అభ్యర్థిగా భావిస్తే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ రాధాకృష్ణ, ప్రభాకర్ పెద్దయ్య, గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్ ఎస్సార్ శీలం తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking