ఖమ్మం ప్రతినిధి ఆగస్టు2 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక గుట్టల బజార్ లోని శ్రీ రామకృష్ణ విద్యాలయం లోని పిల్లల చేతుల కు పండిన గోరెంటాకు ను చూసి విద్యార్ధినీ విద్యార్దులు మురిసిపోయిన వైనం చాలా చూడ ముచ్చటగా ఉన్నది . ఈ రోజు పాఠశాల లో ఆశాడమాసం గోరెంటాకు సంబరాలు అంబారాన్ని అంటాయి వాతావరణ మార్పు కు అనుగుణం గా మన పెద్దలు చెప్పిన ఎన్నో సాంప్రదాయాలు లో ఈ గోరెంటాకు సాంప్రదాయం ఒకటి , పిల్లలకు మన సాంకృతి సంప్రాదాయాలను పరిచయం కూడా అవసరం అని పాఠశాల ప్రధానాచార్య సంతోషా గౌతం అన్నారు . పాఠశాల ఆచార్యులు పిల్లలు కలిసి సంబరం చేసుకున్నారు