మెదక్ గజ్వేల్ ప్రాజబలం న్యూస్ :-
గజ్వేల్ లో జరిగే సీతారామ ఉమామహేశ్వరుల కళ్యాణం కోసం వేలాది భక్తులచే ఒడ్లను ఓలిపించి గోటి తలంబ్రాలుగా సిద్ధం చేపిస్తుంది శ్రీరామకోటి భక్త సమాజం. శుక్రవారం నాడు శేషసాయి మోక్షమందిరంలో గోటి తలంబ్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ భద్రాచల దేవస్థానంలో జరిగిన సీతారాముల కళ్యాణానికి 150కిలొల గోటి తలంబ్రాలను అందించిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రామకోటి సంస్థకు దక్కిందన్నారు. అదే సంకల్పంతో గజ్వేల్ లో జరిగే సీతారాములకు కూడా గోటి తలంబ్రాలు అందిచాలని భక్తుల కోరిక మేరకు శ్రీకారం చుట్టామన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల మెట్టయ్య, యెల్లు రాంరెడ్డి, శేషసాయి భక్తభృదం వారు పాల్గొన్నారు.