అభ్యర్థి వెంకటరామ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందాం.
గ్రామాల్లో బిఆర్ఎస్ కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేద్దాం .
ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు , లీగల్ సెల్ కార్యదర్శి కొట్టాల యాదగిరి ముదిరాజ్.
మెదక్ తూప్రాన్ 26 ప్రాజబలం న్యూస్ :-
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే ముదిరాజుల భవిష్యత్తు పదిలంగా ఉంటుందని, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మద్దతుగా గ్రామాల్లో ముదిరాజులు ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేద్దామని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు , హైకోర్టు న్యాయవాది కొట్టాల యాదగిరి ముదిరాజ్ పేర్కొన్నారు . ఈ సందర్భంగా ముదిరాజులు వెంకటరామిరెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ముదిరాజుల ఆర్థికాభివృద్ధికి కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకాలు అమలు చేసినట్లు గుర్తు చేశారు. బిజెపి , కాంగ్రెస్ అభ్యర్థుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని , విడిపోతే నష్టపోతామని , గోస పడతామని స్పష్టం చేశారు. చెరువులు , కుంటలు , ప్రాజెక్టులలో చేపలు పట్టే హక్కులు కల్పించడంతోపాటు ముదిరాజ్ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోకాపేటలో విలువైన 5 ఎకరాల భూమి , రూ 5 కోట్లు కేటాయించిన ఘనత కేసిఆర్ కు దక్కిందని అన్నారు . గతంలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వినియోగించుకొని అనంతరం పట్టించుకోకపోగా , అందుకు భిన్నంగా కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలతో అట్టడుగున నిలిచిన ముదిరాజుల అభ్యున్నతికి పెద్దపీట వేసి ఆర్ధికంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని గోస పడకుండా కెసిఆర్ కు, బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి అండగా నిలిచే మంచి నిర్ణయం తీసుకుందామని సూచించారు. అయితే గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో 6 లక్షల మత్స్యకార్మిక సభ్యత్వాలు ఇవ్వగా , సబ్సిడీపై టూ వీలర్స్ , త్రీ వీలర్స్ , ఫోర్ వీలర్స్ అందిoచి సమాజంలో ముదిరాజులు గౌరవప్రదంగా బ్రతికేందుకు చొరవ చూపినట్లు చెప్పారు. కులాల పేరిట చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ అభ్యర్థికి తగిన బుద్ధి చెప్పే విధంగా ముదిరాజులు ఐక్యంగా ఉంటూ అన్ని రకాలుగా ఆదుకున్న కేసీఆర్ కు అండగా ఉందామని, తద్వారా సంపూర్ణ న్యాయం దక్కుతుందని వివరించారు . ఈ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగ కొనయిపల్లి పి బి గ్రామం లో శ్రీ కొట్టాల యాదగిరి సర్పంచ్ కంకణాల పాండుముదిరాజ్, మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు నర్ర విఠల్ యూత్ అధ్యక్షులు నాగరాజు ముదిరాజ్, మరియు మల్కాపూర్ జిన్నా రాజు ముదిరాజ్ , నర్సంపల్లి చింతల శేఖర్ ముదిరాజ్, నాయకులు తదీతరులు పాల్గొన్నారు.