పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం కుమార్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 26 : పెద్దపళ్లి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తాండూర్ మండలం కేంద్రంలోని అచలాపూర్,రేచిని గ్రామపంచాయతీ లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం ప్రచారంలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ,మాజీ మంత్రివర్యులు వేణుగోపాల్ చారి,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి మాట్లాడుతూ… కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు 30 లక్షల ఉద్యోగలు భర్తీ.ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹400 రూపాయలకు పెంపు.కాక వెంకట స్వామి మనవడు,వివేక్ కుమారుడు,గడ్డం వంశీ కృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి వారికి భారీ మెజారిటీతో ఆశీర్వదించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 6 గ్యారంటీలను అమలు చేస్తామని అ రోజు ప్రచారంలో చెప్పడం జరిగింది.చెప్పిన విధంగా అమలు చేస్తున్నాం.ప్రజలందరి ఆశీర్వాదంలో కాంగ్రెస్ పార్టీ,మీ ఎమ్మెల్యేగా గెలుపొందిన 100 రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీలలో భాగంగా 5 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది.ఎన్నికలు కోడ్ తరువాత మరో గ్యారంటీ అయినా ₹ 2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం జరుగుతుంది.సోనియా గాంధీ పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా 5 న్యాయ గ్యారంటీలను ప్రవేశపెట్టడం జరిగింది.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పంటకు కనీస మద్దతు ధర,ఉపాధి హామీ కూలీలకు రోజుకు ₹ 400 పెంపు,ప్రతి పేద కుటుంబ మహిళకు ఏటా 1 లక్ష రూపాయలు,ఆరోగ్య బీమా 25 లక్షలు,యువతకు 30 లక్షల ఉద్యోగలు కలిపించడం జరుగుతుందన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 5 న్యాయ గ్యారంటీలను అమలు చేయడం జరుగుతుందని అన్నారు. బీజేపీ,బి.ఆర్.ఎస్ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేసారో చెప్పాలని.బీఆర్ఎస్ ప్రభుత్వంలో వడ్లు కటింగ్ చేసి రైతులను మోసం చేసిన ఘనత BRS ప్రభుత్వనీది అని విమర్శించారు.పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయనా గడ్డం వంశీ కృష్ణ కి మీ అమూల్యమైన ఓటు వేసి పెద్దపల్లి నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking