నూతన 108,102 అంబులెన్సులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా ఆగస్టు18:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధితో ముందుకు సాగుతుందని అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో నూతన 108, 102 అంబులెన్సులను ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలందరి సంక్షేమం కోసం అనేక వర్గాల అభ్యున్నతి కోసం,వారి ఆర్థిక ఎదుగుదల మరియు అనేక పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు.ఆపదలో ఆదుకొని వారిని సురక్షితంగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ లకు తరలించి,వారి ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వరకు సేవలందిస్తున్నటువంటి 108 ఉద్యోగస్తులకు ధన్యవాదములు తెలియజేశారు.పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.దానిలో భాగంగానే సేవలు శరవేగంగా అందించడానికే అంబులెన్సులను అధికంగా మంజూరు చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్,కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజ్వన్ భాష షేక్, వైద్య ఆరోగ్య విభాగం డిఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు,ఎం.శివ కుమార్,శేఖర్,మహేష్,సతీష్,ఆఫ్రోజ్, 108 స్టేట్ లీడర్ బాలాజీ నాయక్, వేణు,చైతన్య,అశోక్ రెడ్డి,సురేందర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking