రజిత కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలకేంద్రంలో అనారోగ్యంతో మరణించిన రజిత కుటుంబన్ని మాజీ ఎమ్మెల్సీ ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట లావణ్య యాదవ్,కాంగ్రెస్ నాయకులు,యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ గడ్డం సతీష్ యాదవ్ స్థానిక నాయకులతో కలిసి ఇటీవల మరణించిన రజిత కుటుంబాన్ని పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు అనంతరం ఇద్దరు పిల్లల చదుకోవడానికి సిద్ధంగా ఉంటే హైదరాబాద్ లొ చదువిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర యాదవ్ సంఘం కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణాల స్వప్న స్థానిక జడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్ బొడ్డు కమలాకర్ యూత్ అధ్యక్షులు ఆకుల దుర్గప్రసాద్,యువ నాయకులు సిరికొండ నవీన్ అదే రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking