ఆర్ డి ఓ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ డ్రైవర్ల సంఘం

‌ఖమ్మం ప్రతినిధి జనవరి 9 (ప్రజాబలం) ఖమ్మం ఆర్ డి ఓ జి.గణేష్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నూతన సంవత్సరం తోపాటు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రకటించింది. మంగళవారం ఆర్డిఓ కార్యాలయంలో అర్ డి ఓ గణేష్ కు పుష్ప గుచ్చాలు అందించి , ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఎండి . అబ్దుల్ హకీమ్, తేజావత్ పంతులు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో సంఘం వ్యవస్థాపకుడు హరినాధ రెడ్డి , జిల్లా ముఖ్య సలహాదారులు మామిడి బాబురావు , జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. వీరారెడ్డి జాయింట్ సెక్రటరీ ఎస్కే. జానీ మియా , నాయకులు ఎస్.కె. అబ్దుల్ పా షా , ఉస్మాన్, రఫీ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking