ఏ చిన్న పొరపాట్లు లేకుండా ప్రజా పాలన డేటా నమోదు చేయాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఖమ్మం ప్రతినిధి జనవరి 9 (ప్రజాబలం) ఖమ్మం డాటా నమోదు, ఏ చిన్న పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్, ఖమ్మం రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో చేపడుతున్న డాటా ఎంట్రీ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ని దరఖాస్తులు ప్రజాపాలన పోర్టల్ లో నమోదు చేసింది, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్, ఆధార్ కార్డు నెంబర్లు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. ఫిజికల్ దరఖాస్తులో ఉన్న వివరాలు సరితూగాలన్నారు. డాటా ఎంట్రీ నివేదిక ను ప్రత్యేక అధికారులు ర్యాoడంగా సూపర్ చెక్ చేయాలని, డాటా ఎంట్రీపై పర్యవేక్షణ చేయాలని ఆయన తెలిపారు. పరిశీలనలో దరఖాస్తులను డాటా ఎంట్రీ ఆపరేటర్లు సూచించిన ప్రదేశంలో మాత్రమే నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఖమ్మం రూరల్ ఎంపిడివో రవీందర్ రెడ్డి, అధికారులు తదితరులు ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking