జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 02(ప్రజాబలం) ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్ ల ఉపయోగాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సులభ బోధన, విద్యార్థులకు త్వరగా అర్థం అయ్యేలా ప్రభుత్వం ఐఎఫ్ పి లను 8, 9, 10 తరగతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో 115 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10 తరగతులకు పాఠశాలకు రూ. 10.58 లక్షలు వెచ్చించి 3 చొప్పున ఐఎఫ్ టి లను సరఫరా చేసినట్లు ఆయన అన్నారు. బోధన ఐఎఫ్ టి లపై చేపట్టి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.