దివంగనేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కు నివాళులర్పించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు

జిల్లా నాయకులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మొహమ్మద్ జావేద్

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 02(ప్రజాబలం)ఖమ్మం వైయస్సార్ 14వ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటి అద్యక్షులు,నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఖమ్మం నియోజకవర్గ పిసిసి సభ్యులు మహ్మద్ జావేద్ లు వైయస్సార్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ఉమ్మడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. రైతులకు, విద్యార్తులకు, మహిళలకు అన్ని వర్గాల ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయని అన్నారు.ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వైయస్సార్ స్ఫూర్తితో ముందుకు పోవాలని అన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ చేసిన కృషి అభినందనీయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా పేరు తెచ్చుకొని ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆనంతరం నగరం లోని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ గారు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలోవీరితో పాటు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు జిల్లా ఓ బి సి సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, టీ పి సి సిఅధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్,ఖమ్మం నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఇంచార్జ్ మాజీ ముదిగొండ జెడ్పి టి సి పసుపులేటి దేవేంద్రం,వైరా నియోజకవర్గ ఎల్ డి ఎమ్ ఇంచార్జ్ మద్దినేని రమేష్,కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,లాకావత్ సైదులు నాయక్, మాజీ కాన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరావు, జిల్లా ఓ బి సి సెల్ ఉపాధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న,సీనియర్ కాంగ్రెస్ నాయకులు చోటా బాబా,జిల్లా కిసాన్ కాంగ్రెస్ నాయకులు కొంటెముక్కల నాగేశ్వరావు నగర మైనారిటి,సేవాదళ్,ఎస్టీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్బాస్,సయ్యద్ గౌస్,దేవత్ శంకర్ నాయక్,వాహబ్,బండి రమేష్, కొత్తపల్లి పుష్ప,దేవత్ దివ్య బండి నాగేశ్వరావు రజిరంజాన్,రియాజ్,ముజాహిద్దీన్,పర్వత శ్రీనివాస్,తలారి నాగభూషణం తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking