గోషామహల్‌ నియోజకవర్గం లో ప్రభుత్వ భూమి కబ్జా

అక్రమ కట్టడాలకు నిలయంగా జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ 14
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ నియోజకవర్గం జాంబాగ్‌ డివిజన్‌ జీ హెచ్‌ ఎమ్‌ సి పరిధిలోని కరాచీ బేకెరి సమీపమున సూర్య మహల్‌ నోటిఫైడ్‌ స్లం లో గతంలో నిరుపేదలకు ప్రభుత్వ స్థలంలో పట్టాలను ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా భూ భాకాసురుడి కన్ను ఈస్థలంపై పడినది. సూర్య మహల్‌ నోటిఫైడ్‌ స్లం పట్టదారులను లోబరుచుకొని డబ్బు ఆశ చూపి ఆక్రమించి స్థానిక రాజకీయ నాయకుల రెవిన్యూ మరియు మున్సిపల్‌ అధికారుల సహకరం తో రెవిన్యూ వారిచే ఎన్‌ వో సి మరియు బల్దీయా సర్కిల్‌ 14 వారిచే నిర్మాణం అనుమతులు కూడా పొందలేదు. స్థానికులు ఎన్ని మార్లు సంభంధిత అధికారులకు ఫిర్యాదులు చేసిపటికిని పేడచెవిన పెడ్తున్నారు అని ప్రజలు తెలుపుతున్నారు.

ఈ పట్టాలకు సంబంధించిన వివరాలు స్థానిక ప్రజలు సంఘాల తరుపున సంబంధిత అధికారులకు కోరిన వివరాలు ఇవ్వడానికి నిరాకరించడం లేదా మాట దాటేయడం చేస్తున్నారు.ఇప్పుడు స్వాయానా మున్సిపల్‌ శాఖ ముఖ్యమంత్రి ఆదీనంలో ఉన్న విషయం అందరికి తెలిసినదే.ముఖ్యమంత్రి పదే పదే అధికారులు భాద్యతతో వ్యవహరించి మున్సిపల్‌ శాఖకు మంచి పేరు తెవాలని కోరుతున్నాప్పటికి మున్సిపల్‌ అధికారులు నిమ్మకు నిరెత్తనట్టుగా వ్యవహరిస్తున్నారు.సూర్యమహల్‌ నోటీఫయిడ్‌ స్లమ్‌ అక్రమ కట్టడం విషయమై 5 నవంబర్‌ 2024 నాడు హైడ్రాకమీషనర్‌ కు లిఖిత పూర్వకంగా కంప్లైంట్‌ ఇవ్వడం జరిగినది.ఆ కాపీని సంబంధిత ఎమ్మర్వోకు ఇచ్చినామని స్థానిక ప్రజలు తెలియజేశారు.ఇందులో ఎమ్మార్వో కార్యాలయంలో నాటకీయ పరిణామం ఏమనగా ఇట్టి విషయం కోర్టు పరిధిలో ఉన్నపుడు సంబంధిత అధికారులు సూర్య మహల్‌ నోటిఫైడ్‌ స్లం పట్టాల విషయం కోర్టుకు తెలియపరచడంలో విఫలమయ్యారని బిల్డర్‌కు భూఅక్రమణదారునికి అనుకూలంగా వ్యవహరించారని స్థానిక ప్రజలలో చర్చ ఇట్టి విషయమై మున్సిపల్‌ అధికారులు రెవెన్యూ అధికారులు ఒక్కటై బ్లిడర్‌కు అనుకూలంగా ఉన్నారని గమనించిన గోషామహల్‌ కానిస్టేన్సీ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో రెవెన్యూశాఖ మంత్రి పోంగులేటీ శ్రీనివాస్‌ రెడ్డికి వినతి పత్రం సమర్పించగా ఆ వినతి పత్రాన్ని హైదరాబాద్‌ కలెక్టర్‌కుదీన్ని పరీక్షించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు పంపారు.ప్రభుత్వ భూమి అయిన ప్రైవేటు భూమి అయిన నిర్మాణం చేపట్టేటపుడు ఎన్‌వోసీ సర్టిఫికేట్‌ మరియు సెట్‌ బ్యాక్‌లతో కూడిన జీహెచ్‌ఎంసీ ద్వారా అనుమతి పొందాలే అలాంటి అనుమతుల సమాచారం కొరకు స్థానిక ప్రజలు స్థానిక సంఘాల నాయకులు వివరణ కోరగా జవాబు దాటేస్తున్నారని చెపుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యే కార్పోరేటర్‌ కూడా చూసి చూడనట్టుగా పోతున్నారని అనుకుంటున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ కార్పోరేటర్‌ జీహెచ్‌ఎంసీ లో ఉన్నత స్థానంలో ఉన్న కార్పోరేటర్‌ భర్త (గోషామహల్‌ నియోజకవర్గం కాదు) కాంగ్రెస్‌ పార్టీలో చేరి గోషామహల్‌నియోజకవర్గంలో స్థానిక నాయకులతొ కలిసి అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నారని దీనివలన కాంగ్రెస్‌ పార్టీ గోషామహల్‌ నియోజకవర్గంలో కనుమరుగయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటున్నారు.జీహెచ్‌ ఎంసీ కొత్తగా సర్కిల్‌14 బాధ్యతలు చేపట్టిన అధికారిణికి ఈ విషయం వినతి పత్రం ద్వారా దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగినది.ఇప్పటికైనా గోషామహల్‌ నియోజకవర్గం భూకబ్జాలుఅక్రమ కట్టడాలు ఆగుతాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking