ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రశ్నించాలి

జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 20 : ప్రజా సంక్షేమం,దేశ అభివృద్ధికి దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమాభివృది పథకాలను క్షేత్రస్థాయి లో పరిశీలించి లబ్బిదారులకు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్ ఉన్నారు. కేంద్ర సర్వీస్ లకు చెందిన వివిధ శాఖల సహాయ విభాగాల అధికారులకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో “విలేజ్ అటాచ్మెంట్ మాడ్యూల్” అంశంపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు రావు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, జిల్లా సంక్షేమా అధికారి కె చిన్నయ్య,జిల్లా పంచాయతీ అధికారి డాక్టర్ అనిత , జిల్లా వ్యవసాయం అధికారి కల్పనతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…ఈ నెల 24 వ తేదీ వరకు కేంద్ర సర్వీస్ లకు చెందిన సహాయ విభాగాల అధికారులు శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వారికి కేటాయించిన గ్రామాలలో ప్రర్యటించి చేపడుతున్న వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇందు కొరకు వారికి సహాయంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు నోడల్ అధికారులుగా నియమించడం జరుగుతుంది అని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును లబ్ధిదారులు అందుతున్న పథకాలను నిశితంగా పరిశీలించిలని తెలిపారు.ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పరిధిలో అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు,సమంత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking