ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 20 : నిరక్షరాస్యత నిర్మూలనకు కొరకు ప్రభుత్వం చేపట్టిన అక్షరాస్యత కరెక్ట్ మని నిరంతరం ప్రసాదించాలని, అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేలా కృషి చేయాలని ఎస్.ఐ.ఈ.టి. రాష్ట్ర ఇంచార్జ్ డాక్టర్ రవి కాంతారావు అన్నారు. జిల్లా యోజన విద్యాశాఖ, సఖి ప్లాంట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాలోని చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా కన్నెపల్లి మండలంలోని కేంద్రం లో నివసిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని జిల్లా యోజన విద్యా అధికారి పురుషోత్తం నాయక్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి రావులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ.ఈ.టి. రాష్ట్ర ఇంచార్జ్ అధికారి మాట్లాడుతూ అక్షరస్యత నేర్పడం లాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. మహిళలకు చదువు నేర్చుకుంటే కుటుంబంతో పాటు సమాజంలో,రాష్ట్ర దేశం అభివృద్ధి చిందుతుందని తమ నేర్చుకున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని తెలిపారు. జిల్లాలో పాఠశాలలో చదువుకుంటున్న,8.9.10 తరగతిలో విద్యార్థులు కూడా నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాల్లో పాల్గొని జిల్లాకు 100 శాతం అక్షరాస్యత జిల్లాగా తీర్చి దినంలో భాగస్వాములు కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి సత్యనారాయణ మూర్తి,మండల బ్యాంక్ అధికారి గురుస్వామి, సఖి లాయర్స్ క్లబ్ అధ్యక్షులు బండ శంకరి,డి.ఆర్.పి లు సువర్ణ ఆర్ ప్రకాష్ సుంద్దిళ్ళ రమేష్ తదితరులు పాల్గొన్నారు.