ధ్రువపత్రాలు ఇక సులభతరం మీ సేవ కమిషనర్ రవి కిరణ్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 20:
మీ సేవల ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలను సులభతరంగా జారీ చేయడానికి అవసరమైన మార్పులు చేయడం జరుగుతుందని మీ సేవ కమిషనర్ రవి కిరణ్ అన్నారు.
సోమవారం రోజున వి సీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మీ సేవ కమిషనర్ రవి కిరణ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ ఛాంబర్ విజేందర్ రెడ్డి పాల్గొన్నారు.ప్రతి మండల పరిధిలోమీ సేవ ద్వారా జారీ చేసే వివిధ ధ్రువపత్రాలు జారీ చేసే ప్రక్రియ లో ఏర్పడుతున్న ఇబ్బందుల విషయంలో కొన్ని సమస్యలను మండల తహసీల్దార్ లు కమిషనర్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మీ సేవ ద్వారా జారీ చేసే ధ్రువపత్రాలు సులభతరంగా జారీ చేయడానికి మార్పులు,చేర్పులు చేయడం జరుగుతుందనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ హరిప్రియ,మండల తహసీల్దార్ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking