టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండూరు రవీందర్, వెంకగారి భూమయ్య
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లాసారంగాపూర్ మండలానికి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక జర్నలిస్ట్ లక్ష్మినారాయనను బెదిరించిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యుజే ఐజేయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొండూరి రవీందర్, వెంకగారి భూమయ్య అన్నారు. సోమవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా రాస్తున్న జర్నలిస్టుపై కొందరు అక్రమార్కులు దాడులు, బెదిరింపులకు గురి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు. వాస్తవాలను రాస్తూ ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్న అధికారులు సరిగా స్పందించకపోవడం పట్ల ఈరోజు జర్నలిస్టుపై దాడులు జరుగుతున్నాయని అధికారులు కూడా ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వార్తలు రాసినా రిపోర్టర్ ల పై దాడులు, బెదిరింపులకు గురిచేసిన వారిపై అత్యా నేరం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని అన్నారు.నిజాయితీగా వార్తలు వ్రాస్తుంటే అవి చూసి తట్టుకోలేక ఇటువంటి బెదిరింపులు చెయ్యడం సరైన పద్ధతి కాదని అన్నారు