లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు 30 లక్షల చెక్కును అందజేసిన ఎస్పీ డాక్టర్ బాలస్వామి, తూప్రాన్ ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ శోభన్ బాబు .
మెదక్ మే 20 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ…
శివంపేట పోలీస్
స్టేష కి చెందిన కానిస్టేబుల్ లక్ష్మా రెడ్డి తేదీ:05.06.2023 నాడు తన విదులు ముగించుకుని తన స్వగ్రామమైన ముప్పిరెడ్డిపల్లికి వెళుతుండగా మార్గమద్యలో పరికిబండ గ్రామ శివారులో అర్దరాత్రి రోడ్డు ప్రమాదానికి గురై తలకు తీవ్ర రక్తగాయాలు అయ్యాయి అని గాయపడ్డ అతడిని వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని యశోధా ఆసుపత్రికి తరలించినామని చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయి మరణించినాడని కానిస్టేబుల్ లక్ష్మా రెడ్డి గారి కుటుంబానికి ఈ
ఎస్. బి . ఐ.బ్యాంక్ పరంగా రావాల్సిన 30,00,000/- రూపాయలను వారి కుటుంబ సబ్యులకు చెక్కు రూపంలో అందించడం జరిగింది. పోలీస్ శాఖ కుటుంబంలోని వారిని కోల్పోయామని వారికి అండగా నిలవడానికి జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. చేతుల మీదుగా 30,00,000/- రూపాయలను వారి కుటుంబ సబ్యులకు చెక్కు రూపంలో అందజేయడం జరిగింది. అలాగే కానిస్టేబుల్ లక్ష్మా రెడ్డి గారికి శాఖ పరంగా రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారని వారి ఔదార్యాన్ని కొనియాడారు మరణ వార్తను దిగమింగుకుని అవయవ దానం చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. తాను చనిపోతు కూడా తన అవయవ దానంతో పది మందికి ప్రాణం పోశాడని అతని సేవలు అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. అతడు అనతి కాలంలోనే తన విది నిర్వహణలో ఉత్తమ కోర్ట్ కానిస్టేబుల్ గా ఉన్నతాదికారుల మన్ననలు పొంది ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడని అతడి సేవలను ఈ సందర్భంగా కొనియాడినారు. కానిస్టేబుల్ లక్ష్మా రెడ్డి గారి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని తమకు ఏ ఇబ్బంది ఎదురైన తమని నేరుగా కలవ వచ్చని ఈ సందర్భంగా అన్నారు.
ఈకార్యాక్రమంలో జిల్లా అదనపు.ఎస్.పి.శ్రీ.ఎస్.మహేందర్ ఎ.ఓ.శ్రీమతి.
లక్ష్మిలావణ్యలత , తూప్రాన్ ఎస్‌బిఐ బ్యాంకు మేనేజర్ శోభన్ బాబు వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.