చెరకు రైతులకు అండగా ప్రభుత్వం

 

చెరకు రైతుల బకాయలు చెల్లించాలి

ట్రైడెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలి

కచ్చితంగా ఫ్యాక్టరీ నడపాలి

….. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి పిబ్రవరి 07 ప్రజ బలం ప్రతినిది:
జహీరాబాద్ ట్రైడెంట్ చక్కర ఫ్యాక్టరీ చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయలు, ఫ్యాక్టరీ ఉద్యోగుల వేతనాలను ఈనెలాఖరు లోగా ఖచ్చితంగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తో కలిసి ట్రైడెంట్ చక్కర కంపెనీ యాజమాన్యం, నిజాం షుగర్స్ రివైవల్ కమిటీ సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రైతు ప్రతినిధులు, కంపెనీ ఉద్యోగ సంఘ ప్రతినిధులు, ఆర్డిఓ, చక్కెర శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరకు రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కంపెనీని వేలం వేయడానికి ప్రకటించినప్పటికీ కంపెనీ యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయలు, ఉద్యోగుల వేతనబకాయలు చెల్లించకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీని కచ్చితంగా నడపాలని, చెరకు రైతుల బకాయిలు, కంపెనీ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని స్పష్టం చేశారు.
జాప్యం చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, చీటింగ్ కేసులు నమోదు చేయడంతో పాటు మిగతా ఆస్తులన్నింటినీ జప్తు చేయడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.
చెరుకు రైతులు అధైర్యపడవద్దని, రైతులకు అండగా ప్రభుత్వం అన్ని విధాల అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్పీ రూపేష్, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు,నిజాం షుగర్స్ రివైవల్ కమిటీ సభ్యులు డాక్టర్ చంద్రశేఖర్, డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం డాక్టర్ రామ్ నాద్, డిఆర్ఓ నగేష్, జహీరాబాద్ ఆర్డిఓ వెంకా రెడ్డి, డీఎస్పీ, చక్కెర శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజశేఖర్,చెరకు రైతుల ప్రతినిధులు, కంపెనీ కార్మిక సంఘ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking