మహిలభివృద్ది, శిశు సంక్షేమ శాఖ అధికారులతో బుదవారం ఐ డి ఓ సి. లో జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ సమీక్ష సమావేశం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ గత సమావేశానికి, ఇప్పటికీ శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న పౌష్ఠికాహారం, శ్యామ్ మామ్, న్యూట్రిషన్ గార్డెన్, మిషిన్ వాత్సల్య, అంగన్వాడి భవనాలు, తదితర వాటి పురోగతిని మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా సామ్ మామ్ పిల్లల పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని బరువు తక్కవగా ఉన్న వారి ని గుర్తించి పౌష్ఠికాహారం అందించాలని ఇంతకుముందే గత సమావేశంలోనే చెప్పడం జరిగిందని అయిననూ శ్యామ్ మామ్ పిల్లలను గుర్తించడం లో నిర్లక్ష్యం వహించి, సరైన సమాధానం చెప్పక పోవడం తో అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ప్రయివేట్ భవనాలలో ఉన్న అంగన్ కేంద్రాల వివరాలు, అందులో ఏమైన రిపేర్స్ ఉంటే నివేదికలు సమర్పించాలని ఆన్నారు.
ప్రతీ అంగన్వాడీ కేంద్రాలలో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశం లో.డి డబ్ల్యు ఓ ఇంచార్జి నాగమణి. సిడిపిఓ, సూపర్ వైజర్స్, ఐ సి డి ఎస్. సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking