బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సతీమణి రామబాయి అంబేద్కర్ గారి 126వ జయంతిని నిర్మల్ లో ఘనంగా నిర్వహించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో డా” బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సతీమణి రామబాయి అంబేద్కర్ గారి 126వ జయంతిని దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచానికే ఆదర్శమూర్తి రామాబాయి అంబేద్కర్ గ్రామంలో జన్మించిన ఆమె పిన్న వయసులోనే బాల్యవివాహం అంబేద్కర్ గారితో జరిగింది. విదేశాలలో అంబేద్కర్ గారి ఉన్నత విద్యకు ఆమె ఎంతో కష్టపడి పిడకలు అమ్మి డబ్బులు సమకూర్చి పంపేది. అలాంటి ఆదర్శ మూర్తులని ఇప్పుడున్న సమాజం ఆదర్శంగా తీసుకోవాలని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లా కేంద్రాలలో ప్రతి గ్రామాల్లో జరపాలని అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేది కేవలం భారతీయ జనతా పార్టీ అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శిలు రాజేశ్వర్ రెడ్డి, మెడిసిమ్మె రాజు, మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఉంగరాల రాజు ,అసెంబ్లీ కన్వీనర్ శ్రీ గాదె విలాస్, పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, పట్టణ ప్రధాన కార్యదర్శులు శ్రీరామోజు నరేష్, అల్లం భాస్కర్, సీనియర్ నాయకులు ఒడిసెల శ్రీనివాస్, నాయకులు రాజు, అయ్యన్న గారి రాజేందర్, హనుమంతు రాజు, తోట సత్యనారాయణ, మహేష్,రమేష్, శ్రీనివాస్, ప్రమోద్, రాజేష్, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking