పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఉమ్మడి ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యేలు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లను ఢిల్లీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే లు మర్యాదపూర్వకంగా కలిశారు.
తమ తమ నియోజకర్గాల్లో సమస్యలను విశ్లేషక పూర్వకంగా వివరిస్తూ సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు, రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం అధిష్ఠానం ఆదేశాల మేరకు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ ఢిల్లీ పర్యటనలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎమ్మెల్యే లు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పాటిల్, పాయల శంకర్, పాల్వాయి హరీష్ వున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking