మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,కేకే మహేందర్ రెడ్డి

 

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి-20 (ప్రజాబలం ప్రతినిధి)

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుందనడానికి నిదర్శనం మానసిక ఆనందం పొందడానికి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారమే రోత పుట్టించే రాతలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు బీఆర్ఎస్ చేస్తున్నారు.సిరిసిల్ల బీఆర్ఎస్ భవన్ కబ్జాకు గురైన ప్రాంతం నుండి ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరానీ మాటలు అన్న రోజు మేము తీవ్రంగా ఖండించడం జరిగింది.ఐఏఎస్ కు క్షమాపణ చెప్పాలని ఆనాడు మేము డిమాండు చేశాం.రాష్ట్ర ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ల సంఘాలు కేటీఆర్ ను వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని హెచ్చరికలు జారీచేసిన వారి ఆలోచన విధానంలో మార్పు రాలేదు.రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా దుబాయ్ కేంద్రంగా నడపబడుతున్న కొన్ని సోషల్ మీడియాల అకౌంట్స్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ చట్టాన్ని సంరక్షిస్తే వారిపై నిందలు వేస్తున్నారు.గత ప్రభుత్వం హయంలో సుమారు వెయ్యి ఎకరాల పైన ప్రభుత్వ భూములు కబ్జాలు చేశారు.నేను పట్నంలో కబ్జా చేస్తా మీరు పల్లెలో కబ్జా చేయండి అన్నట్లుగా కేటీఆర్ తీరు ఉంది.కబ్జా చేసిన భూభాగోతాలు వెలికి తీసి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వమిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే మీకు కంట్లో నాలసయ్యాడని భావించి వారు కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి వెళ్ళిపోతాయని భావిస్తూ కలెక్టర్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారు.ఇంతకంటే నీచమైన సంస్కృతి మరొకటి ఉంటుందా..??మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చెసి జడ్జిలు,సినిమా తారలు, భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నారే ఇదైనా మీ సంస్కృతి.మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగింది. ప్రజలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగింది.సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ ఉన్నతాధికారులను ట్రోల్ చేయొద్దని మీ కార్యకర్తలకు చెప్పాల్సింది పోయి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నారు.స్వయానా జిల్లా కలెక్టర్ నా పైన ఎలాంటి కేసు లేదని ప్రకటించిన కేసులు ఉన్నాయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.వ్యక్తిగత జీవితంపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలి.
ఎలక్షన్ కోడ్ అమలులో ఉండి రాజకీయ నాయకుల ఫోటోలు, శిలాఫలకాలు ముసుగు వేస్తారన్న సంగతి మీకు తెలియదా.మీ బొమ్మలతో ప్రభుత్వల స్థలంలో కట్టిన టీ స్టాల్ లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పడం తప్ప.ఉపాధి పోగొట్టాలని ఆలోచన మాకు లేదు.చిరు వ్యాపారులకు మేము వ్యతిరేకం కాదు,కేటీఆర్ మాట్లాడుతూ నేను లెక్కపెడుతున్న రాసి పెడుతున్న అసెంబ్లీలో కూర్చుని రాస్తున్న అనడం చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు.ఒకరేమో బ్లాక్ బుక్ అని, ఒకరు రెడ్ బుక్ అని కొత్తగా పింక్ బుక్ అంటున్నారు.మీ పదేండ్ల అవినీతి అక్రమ పాలనలో మా కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన మేం భయపడలేదు.ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండరాదని నియమనిబంధన చెప్తుంటే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు.మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని కోరుతున్నాం.జిల్లా కలెక్టర్ ను టార్గెట్ చేస్తూ రోత పుట్టించే రాతలు రాస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోం జాగ్రత్త.డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా అవినీతి జరిగింది.సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన భూభాగోతాలు, డబల్ బెడ్ రూమ్ లలో అవినీతి, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టం.ప్రభుత్వo అధికారులకు అండగా ఉంటుందన్నారు,భూ కబ్జా చేసిన వారు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో అవినీతి చేసిన వారు , రోడ్లు వేసి బిల్లు తీసుకొని మళ్ళీ రెండోసారి బిల్లు తీసుకున్న వారు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వ సొమ్మును ఇచ్చేయాలి.ప్రభుత్వ అధికారుల మనోధైర్యం కోల్పోయేలా మీరు చేసే ప్రయత్నాన్ని చూస్తూ ఊరుకోము.

Leave A Reply

Your email address will not be published.

Breaking