జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20 : 2023-24 సంవత్సరం వానాకాలం,యాసంగి సీజన్లకు సంబంధించి ధాన్యం కొనుగోలు ఏజెన్సీలకు సొసైటీ కమీషన్,1శాతం మార్కెట్ ఫీ చెల్లించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళలతో కలిసి ధాన్యం కొనుగోలు ఏజెన్సీలకు సొసైటీ కమీషన్ అందించడం జరిగినది. డి.ఆర్.డి.ఎ.కు 1 కోటి 98 లక్షల 1 వేయి రూపాయలు, డి.సి.ఓ.కు 78 లక్షల 45 వేల రూపాయలు, డి.సి.ఎం.ఎస్.కు 2 కోట్ల 4 లక్షల 8 వేల రూపాయలు, మెప్మాకు 9 లక్షల 61 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మార్కెటింగ్ శాఖ వారికి 1 శాతం మార్కెట్ ఫీ 4 కోట్ల 74 లక్షల 29 వేల 282 రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. 2023-24 సంవత్సరం వానాకాలం,యాసంగి సీజన్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధనలకు లోబడి రైతుల వద్ద నుండి ఆఖరి గింజ వరకు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.