మెడికల్ కాలేజీలో నిర్వహించిన వైట్ కోట్ క్రిమోనీ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల..ప్రజాబలం ప్రతినిధి:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలో నిర్వహించిన వైట్ కోట్ క్రిమోనీ వేడుకలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
వైద్య విద్యార్థి జీవితంలో ఈరోజు ప్రత్యేకమైన రోజు..
ఎన్నో ఏళ్లుగా వైద్య వృత్తిని చేపట్టాలని కలలుగని నేడు వైట్ క్రిమోని వేడుకలు నిర్వహించడం అభినందనీయం..
తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలి..
విద్యార్థి జీవితం మల్లి రాదు..
కష్టం అయిన ఇష్టపడి చదువుతూ ముందుకు పోవాలి..
తోటి విద్యార్థుల కేరింతలు నడుమ నేడు వారు వైట్ కోట్ అందుకోవడం గర్వించదగ్గ విషయం..
వైద్య వృత్తి ద్వారా పేదలకు ఎంతో సేవ చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రోత్సాహం అందించేందుకు ఇటీవల నూతనంగా కాలేజ్ లను ప్రారంభించడం జరిగింది..
ప్రజారోగ్యం రాబోవు రోజుల్లో మీ చేతుల్లో ఉండనుంది..
గొప్పగా పనిచేస్తూ వైద్య వృత్తికే ఒక పేరు తెచ్చే విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
రానున్న కాలంలో మీ స్థాయిలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వైద్యం అందించాలి..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 16 నూతన నర్సింగ్ కళాశాలను ప్రారంభించడం జరిగింది..
240 పైచిలుకు అంబులెన్స్ ప్రజా ఆరోగ్యం కోసం అందుబాటులోకి తేవడం జరిగింది..
రాష్ట్రంలో వైద్యం ప్రతి పేదవాడికి అన్నాలని సంకల్పంతో రాజు ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల పెంచడం జరిగింది