కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుంది……మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ను ప్రారంభించిన మేయర్‌
జీహెచ్‌ఎంసీ ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్‌, డిసెంబర్‌ 6:ు మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో వ్యాపారవేత్తలుగా తమదైన రంగంలో రాణించి ఉన్నతంగా ఎదగాలని మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు.
శుక్రవారం సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయం వద్ద ఇందిరా మహిళా శక్తి పధకం కింద ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ ను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సామాజిక ఆర్థిక స్థిరత్వం సాధించడంలో మహిళల పాత్ర కిలకమైనదని ,వారు సామర్థ్యాలను పెంపొందించుకుని సొంత వ్యాపారాల్లో నిలదొక్కుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగవచ్చని అన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరిచేందుకు, వారి జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు సహాయపడుతుందన్నారు.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ ద్వారా సంబంధిత గ్రూపు మహిళలు సమిష్టిగా తాము లబ్ధి పొందుతూ, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆశించారు. క్యాంటీన్‌ ద్వారా ప్రజలకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించాలని సూచించారు.జి హెచ్‌ ఎం సి వ్యాప్తంగా మరిన్ని క్యాంటీన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా మొట్టమొదటి మహిళ క్యాంటీన్‌ ప్రారంభించినట్లు తెలిపారు.
అనంతరం మేయర్‌ సంగీత్‌ జంక్షన్‌, వై ఎం సి ఏ వద్ద రూ. 38.51 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్‌ ఎల్‌ఈడి స్ట్రీట్‌ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేసి, ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సౌకర్యాల కోసం ప్రభుత్వం అత్యుత్తమ సాంకేతికతను వినియోగించుకుంటూ నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందని అన్నారు.ఈ స్ట్రీట్‌ లైట్లు రహదారి భద్రత దృష్ట్యా, రాత్రి సమయంలో ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 


ఈ కార్యక్రమాల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శ్రీ గణేష్‌ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం విశేష కృషి చేతున్నందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎంత ఖర్చైనా వెనికాడ లేదని చెప్తున్నారని నియోజవర్గ మహిళా సంఘాలు వ్యాపారం చేయడానికి ముందుకు వస్తే సహకరించడం జరుగుతుంది ఆయా కార్యాలయంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌, స్థానిక కార్పొరేటర్లదీపికబేగంపేట్‌ సర్కిల్‌ డి సి సమ్మయ్య,, యూసి డి ప్రాజెక్టు అధికారి శ్రీనాథ్‌ ఆయా విభాగాల అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking