సిరిసిల్ల ప్రజాబలం ప్రతినిధి:కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ టీపీసీసీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అనా పైసా ఇవ్వకుండా రాష్ట్రాన్ని విస్మరించింది..
నేడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహా నిరసన చేయడం జరుగుతుంది..
బిజెపి ప్రభుత్వం ఎన్నికలు ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రాలకు అధిక బడ్జెట్ కేటాయిస్తుంది..
బీహార్, ఢల్లీిలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాలకే పెద్ద పీట వేస్తోంది..
కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రనికి మొండి చేయి చూపెడుతుంది..
నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై నిరసన వ్యక్తం చేశారు..
రాష్ట్రంలోని 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్ర ఉన్న కేంద్రప్రభుత్వం చేసిన దానికి సిగ్గుపడాలి…
8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు చేతకానితనం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది

కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కేవలం ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు తీసుకెళ్తుంది..
బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు ఒక్కసారన్న కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వండి అని అడిగిన పాపనపోలేదు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బేషాజాలకు పోకుండా ఒక సభలో నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్రనికి పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు..
బయ్యారం ఉక్కు కర్మగారాన్ని పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో విశాఖ స్టీల్ గురించి మాట్లాడతారు..
పాలమూరు రంగారెడ్డికి నిధులు ఇవ్వమంటే వాళ్లు పోలవరం గురించి మాట్లాడుతారు..
ప్రజా ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు..
మహానగరలు అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుంది..
హైదరాబాద్ విశ్వ నగరంగా ముందుకు పోతుంది కనీసం ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ అభివృద్ధి కేటాయించలేదు…
మహిళా మంత్రిగా నిర్మల సీతారామన్ మహిళ లోకాన్ని విస్మరించింది…
పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బిజెపి ప్రభుత్వం అమలు చేయడం లేదు
మన రాష్ట్రం నుండి లక్షల కోట్లు పన్నుల రూపంలో తరలించకపోతున్న రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదు..
బిజెపి ఎంపీ కేంద్రమంత్రుల వైఫల్యానికి నిదర్శనమే రాష్ట్రానికి నిధులు కేటాయించలేకపోవడం…
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల వారికి తమ ప్రాధాన్యత కల్పిస్తాం…
గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం లాగా ప్రజా ప్రభుత్వం ఆడంబరాలకు పోవడం లేదు…
వాస్తవానికి దగ్గరగా ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాం..
కేంద్రాన్ని సహకరించాలని ఎన్నిసార్లు కోరిన పట్టించుకోవడం లేదు…
బిజెపి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో పతనం తప్పదు…
బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్న