మణికొండలో బాల్ బ్యాడ్మింటన్ ఆటల పోటీలు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 3 ఫిబ్రవరి 2025
మణికొండ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ఆద్వర్యంలో అల్కాపూర్ నందు గల జయశంకర్ పార్క్ లో ఒకటీ, మహాత్మాగాంధీ పార్క్ లో రెండు గ్రౌండ్ లలో తెలంగాణ స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్రీడలు క్రీడాభిమానులకు నయనా నందకరంగా జరిపినారు, ఇందులో మణికొండ బాల్ బ్యాడ్మింటన్ తో పాటు హన్మకొండ బాల్ బ్యాడ్మింటన్, బీ.హెచ్.ఈ.ఎల్ బ్యాడ్మింటన్, బీ.హెచ్.ఈ.ఎల్ సంకల్ప బాల్ బ్యాడ్మింటన్, మారుతి బాల్ బ్యాడ్మింటన్, కే.పీ.హెచ్.బీ బాల్ బ్యాడ్మింటన్, ఎం.డీ.జీ.వో బాల్ బ్యాడ్మింటన్, గాయత్రి నగర్ బాల్ బ్యాడ్మింటన్, హెచ్.ఎ.ఎల్ బాల్ బ్యాడ్మింటన్, గట్టుప్పల్ బాల్ బ్యాడ్మింటన్, చేవెళ్ల బాల్ బ్యాడ్మింటన్, ఖమ్మం బాల్ బ్యాడ్మింటన్, కరీంనగర్ బాల్ బ్యాడ్మింటన్, సంగారెడ్డి బాల్ బ్యాడ్మింటన్, మెదక్ బాల్ బ్యాడ్మింటన్ తది తర క్రీడా కారులు పాల్గొనగా ఇందుకుగాను అత్తాపూర్ లో గల జర్మెంటిన్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ సంతోష్, మణికొండ మునిసిపాలిటీ డివిజనల్ ఇంజనీర్ శివ సాయిలు ముఖ్య అతిథులుగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. టోర్నమెంట్ చివరలో ప్రతిభ కనబర్చి మొదటి స్థానం కైవసం చేసుకున్న ఏ.ఎస్.రావు నగర్ కు చెందిన మారుతి బాల్ బ్యాడ్మింటన్, బీ.హెచ్.ఈ.ఎల్ సంకల్ప బాల్ బ్యాడ్మింటన్ వారు రెండవ స్థానం కైవసం చేసుకునడం, మూడవ స్థానం కైవసం చేసుకున్న హనుమకొండ బాల్ బ్యాడ్మింటన్, నాల్గవ స్థానం కైవసం చేసుకున్న మణికొండ బాల్ బ్యాడ్మింటన్ టీమ్ లకు మరియు పాల్గొన్న క్రీడా కారులందరికి ఘనంగా సత్కరించి ట్రోఫీలు అందజేయడ మైనది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎన్నికైన సాయి చరణ్ నీ, రెండవ ఆటగానిగా శశినీ మరియు వివిధ ప్రదేశాల నుండి విచ్చేసిన సీనియర్ క్రీడాకారులను, ఇట్టి ఆటను ప్రోత్సహిస్తూ సేవా భావ క్రీడాభిమాన సంబంధిత వారిని కూడా ఇతోచితంగా సన్మానం చేయడానికి ముఖ్య అతిథిదులుగా పాల్గొన్న తెలంగాణ స్టేట్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సహా కార్యదర్శి కమల్, అత్తాపూర్ లో కల జర్మెంటన్ హాస్పిటల్ ఏం.డీ చైర్మన్ డాక్టర్ జావేద్ జార్ ఖాన్, స్థానిక మాజి కౌన్సిలర్ నవీన్ కుమార్ ల కర కమలములచే ట్రోఫీలు ప్రధానం చెయ్యడం జరిగినదని అసోసియేషన్ ముఖ్య సలహాదారు అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ, ఈ సందర్భముగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సంతోష దాయకమైన శుభ సందర్భముగా మణికొండ గ్రౌండ్ లో జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ప్రతి రోజూ తమ ఆటను కొనసాగిస్తున్నారని, ఆటలోని మేలుకువలను సీనియర్ ల ద్వారా నేర్చుకొంటున్నారని అందు నిమిత్తం త్వరలోనే మణికొండ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను అధికారికంగా ప్రకటించనున్నారనీ తత్ ప్రశ్చియాత్ తెలంగాణ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేస్తామని అందుకు తామందరు సంతోష భరితంగా సంసిద్ధత వ్యక్త పరచడమైనదని సదరు అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ ఉపాధ్యక్షుడు హరిహరనాథ్ రెడ్డి, నరహరి శాస్త్రి, సీతారామరాజు, రమేష్, రామిరెడ్డి, దేవేందర్ రెడ్డి, రాజు, అసిమ్ తదితరులు తెలియ జేసినారు.

 

           

 

             

Leave A Reply

Your email address will not be published.

Breaking