రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 2 ఫిబ్రవరి 2025
మణికొండ ప్రభుత్వ పాఠశాల 2002 – 03 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం పాషా కాలనీ లోని ఏ.కే – ఫంక్షన్ హాల్ లో ముఖ్య అథితులుగా పూర్వ ఆచార్యులు / ఉపాధ్యాయులు ఎండీ.ఎల్. ఫసియుద్దీన్, యాదగిరి, కమల్ సింగ్, ప్రభావతి, శ్రీదేవి, అనిత, శైలజల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగినదని పూర్వ విద్యార్థులు నవీన్ కుమార్, శ్రీను, సంతోష్, రాఘవేందర్, పద్మారావు, దేవేందర్, రాజు, నర్సింగ్, శ్రీనాథ్, శ్రీకాంత్, కృష్ణ, రమేష్, అనంతరావు, ప్రదీప్ రెడ్డి, శివరాజ్, కుమార్, ఆనంద్, అర్జున్, స్వప్న, విజయలక్ష్మి, సరిత, రాధిక, శోభ, సౌందర్య, విజయనిర్మల, దీప, వీరమణి, రజిని, మాధవి, నాగరాణి, నవనీత తదితరులు తెలియ పరుస్తూ తమ ఆనందానికి అవధులు లేకుండా పోయిందనీ, అప్పుడు ఆడుకున్న ఆటపాటలు, వ్యక్తిగత అనుభూతులు చెప్పుకుంటూ ఒక్క చోటికి చేరి పూర్వ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారనీ సంతోషంతో వ్యక్తపరిచారు. ఇట్టి సమ్మేళనానికి ఆనాటి ఉపాధ్యాయులు రాక తమకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని తెచ్చి పెట్టిందని పలువురు తమ అభిప్రాయాన్ని వెళ్ళ బుచ్చారు.
Prev Post
Next Post