రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 27 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని మండలంలోని వెంకట్రావు పేట్ లో జెండా వెంకటాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గోదామును స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందన్నారు.రైతులు పండించిన పంటలు నిల్వ చేయడానికి డీసీఎమ్మెస్ ఆధ్వర్యంలో పలు గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు.దీనిలో భాగంగానే నేడు వెంకట్రావు పేట్ రూ.30 లక్షలతో 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో గోదామును నిర్మించారని వివరించారు.రైతులు బంధు, రైతు భీమా,రైతుల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించి నేడు దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.రైతులకు సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు అండగా ఉండి మరోసారి కేసీఆర్ ను సీఎంగా ఆశీర్వదించాలని కోరారు.అంతేకాకుండా కొందరు ప్రతిపక్ష నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దీనిని ప్రజలు గమనించాలని కోరారు. మాది రైతు ప్రభుత్వం, రైతులతో పాటు అన్ని వర్గాల వారికి అండగా ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య,వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,సంఘం డైరెక్టర్స్,మాజీ డీసీఎమ్మెస్, ఎంపీటీసీ లు,వ్యవసాయాధికారి ప్రభాకర్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking