పట్టణంలో. ఛత్రపతి శివాజీ , కొండా లక్ష్మణ్ బాపూజీ , కవయిత్రి మొల్ల విగ్రహాలు ఆవిష్కరణ. T .హరీష్ రావు. రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి.

 

త్వరలో అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త .

తూప్రాన్ లో రూ . 50 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా 27.09.2023 ప్రజా బలం న్యూస్ :-

గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కే చంద్రశేఖర్ రావు గారి విజన్ తోనే తెలంగాణ అభివృద్ధి లో ముందుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మాత్యులు టి హరీష్ రావు అన్నారు . తూప్రాన్ పట్టణంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను పారంబించడం తోపాటు , పట్టణంలో ఛత్రపతి శివాజీ, విగ్రహం, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహాన్ని, కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరించారు .

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ‘‘కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహాన్ని, కవయిత్రి మొల్ల విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన గొప్ప నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. పేదల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. కేసీఆర్ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఉద్యమం కోసం తన ఇంటినిచ్చిన గొప్ప నాయకుడు కొండా బాపూజీ అని జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన ఆయన ఈ ప్రాంతం బాగుపడాలంటే ప్రత్యేక రాష్ట్రం రావాల్సిందేనని బలంగా నమ్మారు. పద్మశాలి సమాజానికి ఆత్మగౌరవ పత్రిక కొండా లక్ష్మణ్ బాపూజీ ఆని. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది అన్నారు. లక్ష్మణ్ గారి స్మృత్యర్థం తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే తూప్రాన్ అద్భుతంగా అభివృద్ధి చెందింది అని ఉద్యమ సమయంలో తూప్రాన్‌కు వచ్చినప్పుడు ఎటు చూసినా చెత్త చెదారంతో పందులతో అపరిశుభ్రంగా ఉండేది ఆని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పట్టణం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కేసీఆర్‌కు ముందు, కేసీఆర్ వచ్చాక పట్టణంలో ఏం జరిగిందో ప్రజలే బేరీజు వేసుకోవాలి అన్నారు . ఈ ఒక్క రోజే 50 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అని అన్నారు.

ఈ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఆడపడచులు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేం. ఈరోజు మంచినీళ్లు పట్టుకునే ప్రతి ఆడపడచు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తుచేసుకుంటున్నది. రెండు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న ప్రతి అవ్వకు కేసీఆర్ పెద్ద కొడుకులాగా కనిపిస్తాడు. కల్యాణ లక్ష్మి, షాదీ ముభరక్ తీసుకునే ప్రతి ఆడపిల్లకు మేనమామ మన కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ కనిపిస్తాడు. పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశం పాటుపడుతున్న కేసీఆర్ గారి కష్ట పడుతున్నారు. మహిళా పక్షపాతి అయిన కేసీఆర్ గారు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.
నిజం ప్రచారం పెట్టకపోతే అబద్ధం రాజ్యమేలుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాలి. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఆపని ఏకైక రాష్ట్రం తెలంగాణ. కరోనా విపత్తులో సైతం ఆసరా పెన్షన్ ఆగలే. కళ్యాణ లక్ష్మి అగలే. కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టం. ఆయన ప్రాతినిధ్యంవల్లే గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయి. అందుకే ఆయనను గజ్వేల్ లో మళ్లీ గెలిపించుకుంటారని తెలిపారు.

అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. త్వరలో అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారు అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 58.59 ప్రకారం క్రమబద్ధీకరణ పట్టా లు పంపిణీ చేశారు. మెప్మా. ద్వారా 50 మంది మహిళలకు రూ.5.10 కోట్ల చెక్కులు పంపిణీ చేశారు. గంగ పుత్ర సంఘానికి రూ.10 లక్షల మంజూరు , తూప్రాన్ నుండి వేములవాడ కు రైల్వే నిర్మాణ పనులు వేగంగా చేయాలి. తద్వారా పరిశ్రమ లు వస్తాయన్నారు.తూప్రాన్ చెరువు సుందరికరణ. ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులు ప్రారంభించారు.

వారం లో తూప్రాన్ చెరువులో బోట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.తూప్రాన్ ఎస్సీ కాలనీ అభివృద్ధి , కాలనీలో సిసి రోడ్ల ఏర్పాటు, గజ్వెల్ ,తూప్రాన్ లలో ఫంక్షన్ హాల్స్ , షాదీఖాన ల ఏర్పాటు చేస్తామని అన్నారు. టోల్ గెట్ వద్ద వ్యాపారులకు రూ . మూడు కోట్లతో మార్కేట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం లోజిల్లా పరిషత్ చైర్మన్ హేమలత , ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి , జిల్లా కలెక్టర్ రాజర్షి షా , గడ అభివృద్ధి ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి ,యమ.ఎల్.సి. యాదవ్ రెడ్డి, మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కల్లూరి హరిక్రిష్ణ, మున్సిపల్ ఛైర్మెన్ రవీందర్ గౌడ్ , వైస్ ఛైర్మెన్ శ్రీనివాస్, మత్స్యశాఖ డైరెక్టర్ గడప దేవేందర్, మున్సిపాలిటీ కౌన్సిలర్ లు ఆర్.డి.ఓ. జయ చంద్రారెడ్డి , మున్సిపల్ కమీషనర్ మోహన్ , తహశీల్దార్లు విజయలక్ష్మి , శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు ఎలక్షన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి , పద్మశాలి సంఘం సభ్యులు వివిధ సంఘాల ప్రతినిధులు , సంబంధిత శాఖా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking