మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :_
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు త్వరలో జరగబోయే గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ కు గంపగుత్తగా ఓట్లు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం తో పాటు ఎన్నికల ఖర్చులకు 11000 రూపాయలను మంత్రి హరీష్ రావు కు అందజేయడం జరిగింది. ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్న మల్కాపూర్ గ్రామం కెసిఆర్ కు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తుందని ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు కొట్యల యాదగిరి, మామిండ్ల కృష్ణ,ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షుడు పిట్ల చంద్రయ్య, మత్స్యశాఖ అధ్యక్షుడు పాప నర్సింహులు, పెద్దమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ జిన్న వెంకటి.సంఘ సభ్యులు జింక శేఖర్, కాస సత్యం , గుల్లపల్లి రామచంద్రం తెలిపారు.