గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఖమ్మం ప్రతినిధి జనవరి 17 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసి 1.11.2020 నాటికి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటరుగా నమోదు అయ్యెలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ అన్నారు. బుధవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఓటరు నమోదుపై రిటిర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌, ఏఇఆర్‌ఓలతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగబోవు ఉప ఎన్నికకు సంబంధించి ఓటరు జాబితా రూపొందించాల్సి ఉన్నందున ఎన్నిక నిర్వహణకు తాజా ఎలక్టోరోల్‌ రూపకల్పనకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షెడ్యూల్‌ విడుదల చేశారన్నారు. ఇట్టి షెడ్యూల్‌ మేరకు 30 డిసెంబర్‌, 2023 న పబ్లిక్‌ నోటీస్‌ జారీకాగా, 6 ఫిబ్రవరి, 2024 వరకు ఫారం-18 ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందన్నారు. 24 ఫిబ్రవరి, 2024న డ్రాఫ్ట్‌ ఎలక్టోరోల్‌ ప్రచురణ, 24 ఫిబ్రవరి, 2024 నుండి 14 మార్చి, 2024 వరకు అభ్యంతరాల స్వీకరణ, 29 మార్చి, 2024 వరకు అభ్యంతరాల పరిష్కారం, 4 ఏప్రిల్‌, 2024న తుది ఎలక్టోరోల్‌ ప్రచురణ ఉంటుందన్నారు.. అర్హత తేదీ 1 నవంబర్‌, 2023 కు కనీసం 3 సంవత్సరాలకు ముందు గ్రాడ్యుయేషన్‌, తత్సమాన అర్హత పూర్తి చేసియుండాలన్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌గా నమోదు అయిన వారు, క్రొత్తగా నమోదు అయే వారు అందరూ ఇప్పుడు తాజాగా నమోదు కావాలన్నారు. దరఖాస్తు ఫారం-18 ద్వారా మాన్యువల్‌ గాను వెబ్‌ సైట్‌ ద్వారా ఆన్లైన్‌లో గాని నమోదు చేసుకోవచ్చని ఆయన అన్నారు. నమోదుకు దరఖాస్తుతో పాటు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ధృవీకరణ ప్రతి గెజిటెడ్‌ అధికారితో అటెస్టెడ్‌ చేయించాలని, ఫోటోగ్రాఫ్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఎపిక్‌ కార్డ్‌ ప్రతి జతచేయాలన్నారు ఓటరు నమోదు దరఖాస్తులతో సమర్పించిన సర్టిఫికేట్లను క్షుణ్ణంగా పరిశీలించి వారి వారి స్థాయిలో అప్రువ్‌ చేయాలన్నారు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ప్రతిఒక్కరు ఎలక్టోరోల్‌ లో నమోదయ్యేలా ఓటరు నమోదు శాతం పెంపొందించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి స్థాయిలో చేపట్టవలసిన ప్రక్రియను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌, ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌, ఖమ్మం, కల్లూరు రెవిన్యూ డివిజన్‌ అధికారులు గణేష్‌, అశోక్‌ చక్రవర్తి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాజేశ్వరి, జిల్లా పంచాయితీ అధికారి హరికిషన్‌, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి.వి.అప్పారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా .బి.మాలతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాంబాబు, మాస్టర్‌ ట్రైనర్‌ శైలెందర్‌, తహసీల్దార్‌లు, డిప్యూటీ తహసీల్దార్‌లు, ఎం.పి.ఓలు తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking