పెద్దపెల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోమాస సచిన్ నేతను ప్రకటించాలి

ఎస్సీ యువశక్తి తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ నిట్టురి రవి మాదిగ

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 17: కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గోమాస సచిన్ నేతను ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎస్సీ యువశక్తి రాష్ట్ర కోఆర్డినేటర్ నిట్టురి రవి మాదిగ ఓయూలో ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా రవి మాదిగ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు ఆదర్శంగా సచిన్ నేత నిలుస్తున్నారు. కరోనా మహమ్మారితో దేశం అతలాకుతలమవుతుంటే కరోనాను లెక్కచేయకుండా నిరుపేద ప్రజలకు తన వంతుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కొంతమంది యువత చెడు అలవాట్లకు బానిసలు అవుతూ చెడు మార్గంలో వెళ్తుంటే వారిని సచిన్ తన మాటలతో మార్చి మంచి మార్గంలో కి తీసుకువచ్చి ప్రజల మన్ననలు పొందుతున్నారు. అలాంటి ప్రజానేతకు పెద్దపెల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సచిన్ నేత కు అవకాశం ఇస్తే భారీ మెజారిటీతో గెలుస్తారని రవి మాదిగ ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking