ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో అదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కై వివిధ రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, కర్షక,పెన్షనర్ల సంఘాలు,కుల సంఘాలు,యువజన, విద్యార్థి సంఘాలు తదితరులు హాజరై పై అంశం కొరకు సమావేశం ఏర్పాటు చేసి విపులంగా చర్చించి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన నిర్మల్ జిల్లాకు గత దశాబ్ద కాలంగా నిరాశ నిస్పృహలకు గురైనటువంటి ప్రజల చిరకాల వాంఛ నిర్మల్ కు రైల్వే కూత అనే అంశంతో అదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ చైర్మన్ గా ఎం సీ లింగన్న.కన్వీనర్ గా డాక్టర్ ఈసవేణి మనోజ్ యాదవ్ గార్లను ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎంసీ లింగన్న మాట్లాడుతూ రైల్వే లైన్ సాధించేవరకు వివిధ స్థాయిలో అందర్నీ కలుపుకొని ఉద్యమ కార్యక్రమాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసి వచ్చే విధంగా వినూత్న కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో రావుల రాంనాథ్,పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎస్ఎన్ రెడ్డి, మల్లారెడ్డి ,జెఎసి నాయకులు వి ప్రభాకర్, వై సాయన్న, కొట్టే శేఖర్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, డి రాములు ,వెంకట్ స్వామి ,బి రంజిత్, ముత్యం యాదవ్ ,నిమ్మ గణేష్, లక్ష్మణ్ ,మురళి ,మనోహర్ రెడ్డి ,పద్మనాభం గౌడ్, విలాస్ ,జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు