ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 07 : గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం రోజున దండేపల్లి ఎంపీడీవో ప్రసాద్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలలో పారిశుద్ధం మంచినీటి సరఫరా వీధిలైట్లు డంపింగ్ యార్డ్స్ హరితహారం పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ దామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటి వ్యాధులు అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్న నేటికీ పనికి భద్రత శ్రమకు తగిన వేతనం ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేదు.ఇస్తున్నది అతి తక్కువ వేతనాలు అవి కూడా నెలల తరబడి చెల్లించకపోవడంతో కార్మికుల అప్పులపాలై అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సంవత్సరాల గడిచిన ప్రభుత్వం కార్మిలకు ఇచ్చేటువంటి యూనిఫాంలు సబ్బులు బెల్లం చెప్పులు ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు.కాబట్టి గ్రామ పంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి కనీసం 26,000 చెల్లించాలి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కారోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలి లేకుంటే భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు చిట్యాల నవీన్, ఓరగంటి రాజలింగం భూమేష్ సత్తన్న మురళి లక్ష్మి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.