పలకరించి 13 వేల రూపాయల దోపిడీ

 

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 7,( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: నెల రోజుల కిందట పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డి పేట, రాయికోడ్, మంతూర్, ఇలా వివిధ గ్రామాలలో రగ్గులు అమ్ముతాం గ్యాస్ పోయిలు రిపేర్ చేస్తామంటూ గ్రామాల్లోకి వచ్చి ఇంతకు ముందు పలు గ్రామాలలో దొంగతనలు చేసిన విషయం పలువురికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు దొంగలు కొత్త తరహాలో దొంగతనాలు ప్రారంభించారు, దారి గుండా వెళుతున్న వారిని గుర్తుతెలియని వ్యక్తులు అటకయించి ఆపి భయపెట్టి,13, వేల రూపాయలు దోచుకున్న సంఘటన జోగిపేట పట్టణంలో చోటు చేసుకుంది,స్థానిక ఎస్సై పాండు,కథనం ప్రకారం, బస్వాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అను కిషోర్, జోగిపేట బస్టాండ్ లో బస్సు దిగి మార్కెట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, ఆపి భయపెట్టి, 13 వేల రూపాయలు దోచుకున్నారని , బాధితుని ఫిర్యాదు మేరకు వారిని గుర్తించినట్టు తెలిపారు,వారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన, శివకుమార్, కాగా జహీరాబాద్ కు చెందిన, ఇలాస్ పూర్ ఆకాశలు, గా గుర్తించి, జోగిపేట ఎస్సై పాండు, వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking