ప్రభుత్వ ఆసుపత్రిలో పనిపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్ స్వీపర్స్,పేషంట్ కేర్, సెక్యూరిటీ సమస్యలు పరిష్కారం చేయాలి
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ మార్చి 07 : యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం రోజున లక్షెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ…రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఔట్సోర్సింగ్ సిబ్బంది,పేషంట్ కేర్, శానిటేషన్,స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర సిబ్బందికి వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించి వారి కుటుంబాలను అదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజీలు మరియు వైద్య విధాన పరిషత్ విభాగం పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, జిల్లా ఆసుపత్రులలో పనిచేస్తున్న కాంట్రాక్ట్,పేషంట్ కేర్, శానిటేషన్,స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్స్ చాలా సమస్యలతో బాధపడుతున్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్ చాలా ఇబ్బందులు పెడుతున్నారు.ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు చెల్లించకుండా తక్కువ చెల్లిస్తున్నారు. అన్ని హాస్పిటల్స్లోలో ప్రభుత్వం నిర్ణయించిన రూ.16,600/-లలో కార్మికుడికి,రూ.12,093/-లు చెల్లించి మిగిలినవి పిఎఫ్, ఈఎస్ఐ ఖాతాలలో జమ చేయవల్సి ఉంది.కానీ కాంట్రాక్ట్ సంస్థలు అన్నీ కుమ్మక్కై రాష్ట్రవ్యాప్తంగా రూ.10,500/-లు, రూ.11,000/-లు మాత్రమే చెల్లిస్తున్నారు.లక్షల రూపాయలు కార్మికుల డబ్బు కాజేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం చెల్లించే విధంగా హాస్పిటల్స్ అధికారులకు, కాంట్రాక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వగలరు. ఇవ్వని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోగలరని కోరుతున్నాము.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వర్కర్స్ పాల్గొన్నారు.