విద్యుత్ కోతలు అరికట్టాలి…

 

వ్యవసాయానికి విద్యుత్ కోతలు లేకుండా ఇవ్వాలి

👉వేలాడుతున్న వైర్లు సరి చేయాలి
👉రైతు సంగం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు
👉విద్యుత్ యస్.ఈ కి వినతి పత్రం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 07(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/వ్యవసాయానికి విద్యుత్ కోతలు అరికట్టాలని,వేలాడుతున్న వైర్లు సరి చేయాలని రైతు సంగం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు.శుక్రవారం నాడు జిల్లా విద్యుత్ శాఖ యస్. ఈ. శ్రీనాథ్ కు వినతి పత్రం ఇవ్వటం జరిగింది.ఈ సందర్బంగా అయన మాట్లాడుతు జిల్లా వ్యవసాయంకు విద్యుత్ కోతలు అరికట్టి నాణ్యమైన విద్యుత్ ను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కరెంట్ కోతల వలన కొండాపూర్, సంగారెడ్డి కంది సదాశివపెట్, పుల్కల్ చౌఠాకూర్ హతనురా మండలంలో బోర్ మోటార్ ఖాళీ పోయి,పంటలు ఎండిపోయి రైతులు నష్ట పోతున్నారని అన్నారు.రైతుల పై అదనపు భారం పడుతున్న దని అన్నారు.అనేక చోట్ల విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని వాటిని సరి చేయాలని అన్నారు.మండలాలలో విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉంచాలని అన్నారు,విద్యుత్ సమస్యను పరిష్కారం చేస్తామని యస్ ఈ హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమం రైతు అధ్యక్షులు రాజయ్య, నాయకులు శ్రీనివాస్,మాణిక్ రెడ్డి,అశోక్ రామకృష్ణ రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking