ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 15 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని పూలే ప్రాంగణంలో సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించటం జరిగింది . గొప్ప సంఘసంస్కర్త తన రచనలతో, పాటలతో సంచార జీవితం సాగిస్తున్న బంజారాలను ఒక దగ్గరకు చేరదీసి ప్రకృతి కి అనుగుణంగా ఎలా బతకాలో, సంఘటితంగా ఎలా ఉండాలో బోధనలు చేసిన మహానుభావుడు .
అంతేకాకుండా ఆ రోజుల్లో మూఢనమ్మకాలు , జంతుబలులను వ్యతిరేకించినటువంటి సామాజిక సంస్కర్త . ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు రెండు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు . 8వ షెడ్యూల్లో బంజారాల భాష అయినటువంటి గోరో బోలో ను పొందుపరచాలని , అలాగే ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని , 10 కోట్లకు పైగా ఉన్న బంజారాలు ఇప్పటికీ దుర్భరమైన జీవితాన్ని గడుపుచున్నారు వారికి కేటాయించిన బడ్జెట్ ను వారికే ఖర్చు చేయాలి బంజారాలంతా ఐకమత్యంగా రాజ్యాధికార సాగాలని సంత్ శ్రీ సేవాలాల్ ఆశయానికి అనుగుణంగా నడుచుకోవాలని కోరారు