గ్రామీణ వైద్యుల సహాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 15 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో ఎస్సార్ ఫంక్షన్ హాల్ లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బాలబోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన 22వ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షులు నేతి రాజేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులే ప్రాణదాతులని గ్రామీణ వైద్యులందరూ ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు . గత 22 సంవత్సరాలు నుండి మహాసభలను నిర్వహిస్తున్నారని , ఎటువంటి స్వార్థపూరితము లేకుండా ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించింది మన సంఘమే అన్నారు . అనంతరం స్పర్శ హాస్పిటల్ ఎండి కాకి భాస్కర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి వైద్యం అందించేలా చూడాలని అలాగే ప్రజలకు నాణ్యమైన , మెరుగైన వైద్యం అందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు . కరోనా టైం లో అత్యధిక సేవలను అందించింది గ్రామీణ వైద్యులు మరియు హాస్పిటల్స్ డాక్టర్లే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాచారి . హనుమంతరావు , జిల్లా నాయకులు వీటి దాస్ , వైరా శీను , అమృతరావు , పి నాగేశ్వరరావు , నాగబాబు రెడ్డి , మస్తాన్ పాషా , భద్రాది కొత్తగూడెం జిల్లా నాయకులు , నలగొండ , వరంగల్ , కరీంనగర్ , అదిలాబాద్ , మెదక్ , రంగారెడ్డి , మహబూబ నగర్ జిల్లా నాయకులు మరియు ఖమ్మం జిల్లా వివిధ ఆస్పత్రుల వైద్యులు
పాల్గొన్నారు . సుమారు 2000 మంది దాకా ఆర్.ఎం.పి , పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధం సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేశారు .