మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య
మెదక్ జిల్లా నూతన కార్యవర్గాలకు పిలుపు
మెదక్ ప్రజా బలం న్యూస్ :-
ఐకమత్యంతో ముందుకు సాగితే తమ హక్కులను సాధించుకోవచ్చని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పేర్కొన్నారు. బుధవారం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బట్టి ఉదయ్ కుమార్, యువక మండలి జిల్లా కన్వీనర్ బోనగిరి చంద్రశేఖర్, పట్టణ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కొంగటి గట్టేష్ను ఆయన సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపులంతా రానున్న రోజుల్లో ఐక్యంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం పట్ల సభ్యులు బాధ్యతతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ కోఆర్డినేటర్ వీర్ కుమార్, జర్నలిస్టు ఫోరం సంగారెడ్డి జిల్లా కన్వీనర్ పరుశురాం, మెదక్ జిల్లా ఫోరం సభ్యులు గడ్డం ప్రశాంత్ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.