ప్రజా బలం ప్రతినిధి ఉప్పల్ అక్టోబర్ 30:తార్నాక నారాయణ పాఠశాలలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీపావళి విశిష్టతను తెలిపే విధంగా విద్యార్థులు గణపతి, లక్ష్మీ, సరస్వతి, శ్రీ కృష్ణుడు, సత్యభామ, రుక్మిణీ వేషధారణలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హారైన జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వర్ లు మాట్లాడుతూ దీపావళి పండుగను నరకాసురుడు అనే రాక్షసుని సంహారం జరిగాక దేవతలు, ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో ఈ దీపావళి వేడుకను జరుపుకున్నారని తెలిపారు.
అదే ఆనవాయితితో ఇప్పటికి దీపావళి రోజున దీపాలు వెలిగించి టపాసులు పేల్చి పండుగను జరుపుకుంటాము అని తెలిపారు. మన సంస్కృతీ, సాంప్రదాయాలను తెలిపే విధంగా ఇలాంటి పండుగలు పాఠశాలలో జరపడం వలన విద్యార్థులకు మన పండుగల విశిష్టతపై అవగాహన కల్పించమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ పర్వేన్, ఈ చాంప్స్
కో- ఆర్డినేటర్ లక్ష్మీ భవాని, ఈ- కిడ్జ్ కో-ఆర్డినేటర్. నూర్,
ఈ చాంప్స్ విపి సరిత, ఈ. కిడ్స్. విపి షాహీన్, ఏవో మహేందర్, ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు