ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ అక్టోబర్ 30 :
మందమర్రి ఏరియాలోని హై స్కూల్ గ్రౌండ్ లో డబ్ల్యూ పి ఎస్ అండ్ జి ఏ వారి ఆధ్వర్యంలో 60వ వార్షిక క్రీడలలో భాగంగా హాకీ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిధిలుగా స్టోర్ ఇంచార్జి పైడి ఈశ్వర్, ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణలు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ కోల్ ఇండియా స్థాయిలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకునేందుకు సింగరేణి స్థాయిలో ప్రత్యేక క్రీడలు నిర్వహించడం అభినందనీయమని వారన్నారు. క్రీడాకారులు కోల్ ఇండియా స్థాయిలో బహుమతులు సాధించి సింగరేణికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. ఈ టోర్నమెంట్ లో విన్నర్ గా మందమర్రి గ్రూప్, రన్నరప్ గా బెల్లంపల్లి గ్రూపులు నిలిచాయి. ఈ కార్యక్రమమంలో క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ భీమనాథుని సుదర్శన్, ఏఐటీయూసి సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్,
అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, బాణయ్య, గాండ్ల సంపత్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఎస్. శివ కృష్ణ, జనరల్ క్యాప్టెన్ శాఖ శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.