మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు
ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 5
మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో కార్మికులకు వారి కుటుంబాలకు పెన్షన్స్ స్కీం అమలయ్యేలా చేసిన ఆధ్యుడు కాకా అని పేదల కోసం నిగ్గదీసి అడగడంలో నిజం మాట్లాడడంలో కాక వెనుకడు వేసిన రోజు లేదని అంబేద్కర్ ఆశయాల కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన మహానీయుడు రాజకీయ భీష్ముడు కార్మిక బాంధవుడు అని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోడిశాల పరమేష్,పైడిపల్లి దేవేందర్,గుండ్ల వెంకన్న,రాజేందర్,సింగిరెడ్డి గోపాల్ రెడ్డి,పెద్ది కుమార్,రాజబాబు, కొమురయ్య,రాజయ్య,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.