అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి అక్టోబర్ 5

జమ్మికుంట మండల పరిధిలో నాలుగు టిప్పర్లు, ఇసుక డంపు దొరికిన కేసులో కాంట్రాక్టర్ అయినా మాధవరావును పట్టుకొని విచారించగా అతను ఇచ్చిన సమాచారం మేరకు విలాసాగర్ గ్రామస్తులైన 52 మంది ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు, ఓనర్లు తాము మానేరు వాగు నుండి ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకొనుటకు పరిమళ కాలనీ, శంభునిపల్లి వద్ద డంపుగా పెట్టినామని ఒప్పుకొనగా 53 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగినది. ఇంకా ఈ కేసులో కొంతమంది పరారీలో ఉన్నట్లు జమ్మికుంట సీఐ వరగంటి రవి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking