నత్త నడకన సా…గుతున్న నల్లావాల్ గుంత పనులు
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్ 5
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని స్థానిక గాంధీ చౌరస్తా నుండి కోరపల్లి, విలాసాగర్ కు వెళ్ళు ప్రధాన రహదారిలో మంచినీటి నల్లా వాల్ కొరకు గత కొద్ది నెలల క్రితం సంబంధిత అధికారులు సిబ్బంది మరమ్మత్తు కోసం గుంతను త్రవ్వి నత్త నడకన మరమత్తు పనులు సాగిస్తున్నారు. ఇట్టి నల్లా వాల్ గుంత చుట్టూ బారికేడ్లను రోడ్డుకు సగం వరకు అడ్డుగా పెట్టడం వలన, వాహనదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇట్టి దారి గుండా అనునిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కు రైతులు వెళ్లాలన్నా ఈ దారినే వెళ్తారు. అంతేకాక ఎమ్మార్వో, ఎంపీడీవో, జమ్మికుంట పట్టణ మున్సిపాలిటీ ఆఫీసులకు వెళ్లాలన్నా ప్రజలు ఈ దారినే వెళ్ళాలి.అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ) కు ప్రతిరోజు పెద్ద పెద్ద లారీలు డీసీఎం వ్యాన్లు, నడుస్తూ రోడ్డు రద్దిగా ఉంటుంది, ఆర్టీసీ బస్సులు కూడా ఈ దారిన వెళతాయి ఇట్టి క్రమంలో రోడ్డుకు సగం వరకు ఏర్పాటు చేసిన బారిగెట్లు ల వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అటువంటి ఈ దారిపై నల్లా వాల్ కోసం తవ్విన గుంత మరమ్మత్తులో అలసత్వం వహిస్తున్న అధికారులు వెంటనే తేరుకొని స్థానిక ప్రజలకు వాహనదారులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, నల్ల వాల్ కోసం తవ్విన గుంతను తక్షణమే స్పందించి మరమ్మతులు పూర్తి చేసి రోడ్డుపై వెళ్లే వాహనాలకు స్థానిక ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండ చూడాలని పట్టణ ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు..
