నిర్మల్ మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలి!*అడ్వకేట్ జగన్ మోహన్ బిఏస్పి నిర్మల్ జిల్లా ఇంచార్జీ

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుల నెలసరి జీతం, పిఎఫ్,ఈఎస్ఐ తదితర సమస్యల కోసం ఆందోళన చేస్తున్న వారికి బిఎస్పి నిర్మల్ జిల్లా ఇంచార్జీ జగన్ మోహన్ మద్దతు తెలిపి మాట్లాడుతూ.నిర్మల్ మున్సిపల్ కార్మికులుగా సానిటరీ విభాగంలో 190,కొత్త లేబర్స్ 45,అలాగే 15 మంది కొత్త డ్రైవర్స్ అందరు కలిసి నిర్మల్ పట్టణంలోని పలు కాలనీలు అన్నింటిలో సానిటరీ వాటర్ సప్లై మొదలగు పనులు చేస్తున్న వారు గత ఐదు రోజులుగా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ఆందోలన చేస్తున్న కూడా ఒప్పంద కార్మికుల డిమాండ్ పరిష్కరించక పోవడం దారుణం అని జగన్ మోహన్ అన్నారు.
ఒప్పంద కార్మికులకు 4 నెలల వేతనం ఔట్సోర్సింగ్ కార్మికులకు రెండునెలల వేతనం మూడు నెలల ఏరియర్స్ తో కార్మికులకు నేటికి చెల్లించకపోవడం నిర్మల్ మున్సిపల్ పాలకవర్గానికి అది కారులకు తగదని, కాంగ్రేస్ ప్రభుత్వం నిర్మల్ పారిశుద్ద కార్మికులు సమస్యలు గాలికి వదిలేసారని విమర్షించారు, పట్టణంలో పారిశుద్ధ కార్మికులు విధులు నిర్వహించక పోవడం వలన పలు పట్టణం లో దుర్గందం వల్ల వ్యాదులు ప్రభలే ప్రమాదం ఉన్నదని వెంటనే న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వీరికి ఉద్యోగ భద్రతకు చొరవ చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దసరా,దీపారళి పండుగలు రానున్నయని ఒప్పంద కార్మికులకు వేతనాలు చెల్లించాలని వీరి పట్ల నిర్లక్యం తగదని గత నాలుగు నెలల నుంచి వేతనాలు మున్సిపల్ కార్మికులకు చెల్లించకుండా కూడ విధులను బాధ్యతగా నిర్వహించిన కార్మికులు గొప్పతనం అని, వెంటనే కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని జగన్‌ మోహన్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా మహిళ కన్వీనర్‌ ఎస్కే.లక్ష్మి యా దవ్,నాయకులు పులి శ్రీనివాస్,బ్యాగరి ఈశ్వర్.గైక్వాడ్ జై య్ శ్రీ, పత్రి తిరుమల మున్సిపల్ కార్మికుల లతోపాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking