ఘనంగా గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు

 

పేద ప్రజలకు, బడుగుబలహీన వర్గాలకు తన సేవలను అందించిన వ్యక్తి గడ్డం వెంకటస్వామి

అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా ప్రతినిధి
5.10.2024:

శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశానుసారం మాజీ కేంద్ర మంత్రి, పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను
జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి మ్మెల్యే గా . ఎంపీ గా మరియు కేంద్ర మంత్రిగా అనేక హోదాలలో పనిచేస్తూ పేద ప్రజలకు, బడుగుబలహీన వర్గాలకు తన సేవలను
అందించారని. ముఖ్యంగా పేదలకు ఇళ్ళ స్థలాల కోసం ప్రభుత్వ భూములు ఇప్పించడానికి కృషి చేశారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వై.దామోదర్ రెడ్డి, బి సి సంక్షేమ అధికారి నాగరాజు, టీ.ఆన్.జి.ఓ జిల్లా అధ్యక్షులు నరేందర్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking