ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 25 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. సోమవారం ఈ సందర్భంగా వాకర్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ…పూర్వకాలంలో ఒక రాక్షసి ఉండేది గ్రామాలలో చిన్న పిల్లలు మింగేది,అయితే గ్రామస్తులు అందరు కలిసి ఒక రోజు ఒక నిర్ణయం తీసుకొని,రాక్షసి తో మా గ్రామం నుండి రోజుకు ఒక కుటుంబం నుండి ఒక పాపను కాని,బాబును ఇస్తామని,చెప్పడంతో అలా కొన్ని రోజుకు కొనసాగుతున్న సమయంలో ఒక కుటుంబంలో ఒక ముసలావిడ బాబు ఉండే వారు,వారి వంతు వచ్చే సమయానికి వారు ముందుగా ఒక మహా ఋషి వద్దకు వెళ్ళి,వారి యొక్క బాధను చెప్పు కోవడంతో ఆ మహా ఋషి ఒక సూచన చేస్తాడు.చిన్న పిల్లలతో రాక్షసిని తిట్టమని చెప్పారు.ఆ రోజు పిల్లలందరూ కలిసి తిట్టడం తో రాక్షసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.ఇక రాదు ఆ సమయం నుండి ఈ హోలీ పండుగ నిర్వహించడం జరుగుతుంది తెలిపారు.
అనంతరం పలువురు వాకర్ అసోసియేషన్ సభ్యులు పలువురు మాట్లాడుతూ… మనసులోని చెడును పాల దోలి మంచిని తీసుకోవాలని ప్రతి మనిషి సమాజానికి ఉపయోగపడేటట్లు ఉండాలని అన్నారు.ఈ రోజున చిన్న పెద్ద లేకుండా కులాలకు మతాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ హోలీ పండుగను జరుపుకున్నాం మని ప్రతి సంవత్సరం ఇదే విధంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటున్నామని వాటర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, చిన్నారులు,పెద్దలు,వ్యాపారులు,ఉద్యోగులు,రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.