ఏ సి పి ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.

ప్రజాబలం ప్రతినిధి వరంగల్ ఆగస్ట్15-
77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుండా ప్రభాకర్ గుప్త ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎ సి పి ఎస్ అధ్యక్షుడు ప్రబాకర్ గుప్త స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని స్వతంత్ర సమరంలో పోరాడి ఆసువులు బాసిన వీరుల చరిత్రను పాఠశాల విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం చిన్నపిల్లలకు మిఠాయిలు పంచి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గుండ రాము, యాంసాని విశ్వేశ్వర రావు, నార్ల బాలరాజు, బజ్జూరి శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking